ఎస్ ఎన్ పురం సంత వేలం….

ఎస్ ఎన్ పురం సంత వేలం….
వర్ని, ఆంధ్రప్రభ : మండల కేంద్రంఅయిన సత్యనారాయణపురం గ్రామ పంచాయితీ వారంతపు సంత తైబజార్ వేలం సోమవారం నిర్వహించారు. సర్పంచ్ కనకదుర్గ రవి అధ్యక్షతన ఈ వేలం నిర్వహించారు. రూ. 9,03000 కు ఎల్లారెడ్డికి చెందిన ముజీబుద్దీన్ వేలంలో తైబజార్ నిర్వహణ చే జిక్కించుకున్నారు..
రోజు వారి మార్కెట్ తైబజార్ ను 2,75,100రూపాయలకు కమ్మరి సాయిలు దక్కించు కున్నారు. ఈ వేలం పాటలో ఉప సర్పంచ్ రెడ్డి రాంబాబు కార్యదర్శి సాయిలు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
