Rs.75 lakhs | గౌరవ వేతన బడ్జెట్ నిధుల విడుదల

Rs.75 lakhs | గౌరవ వేతన బడ్జెట్ నిధుల విడుదల
Rs.75 lakhs | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని అసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగుల గౌరవ వేతన మూడో విడత బడ్జెట్ ను గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department) కమిషనర్ విడుదల చేస్తూ ఉత్తరంలో బడ్జెట్ ను గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆదిలాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ గురువారం తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వేతన నిధులు రూ.42 లక్షల 50 వేలు, నిర్మల్ జిల్లాకు రూ.16 లక్షల 20వేలు, అదిలాబాద్ జిల్లాకు రూ.75 లక్షల(Rs. 75 lakhs) 55 వేలు, మంచిర్యాల జిల్లాకు రూ.13 లక్షల 50 వేలు విడుదలయ్యాయని కేబీసీ నారాయణ ఆంధ్రప్రభ తో తెలిపారు. వేతన నిధుల బడ్జెట్ విడుదల చేసిన గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కు ఉట్నూర్ ఐటిడిఎస్ పిఓ యువరాజ్ మర్మటు గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా అధికారి అంబాజీ జాదవ్ కు డిటిడిఓలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
