రూ. ఏడు కోట్లు మంజూరు

రూ. ఏడు కోట్లు మంజూరు

యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్రప్రభ : భువనగిరి నుంచి గజ్వేల్ వెళ్లే జాతీయ రహదారి 70 కిలోమీటర్లు(70 kilometers) వరకు రోడ్డు మరమ్మత్తు పనులకు రూ. 7 కోట్లు నిధులు మంజూరయ్యాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు(reporter)ల సమావేశంలో మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ బ్రిడ్జి మరమ్మతులకు రూ.76 లక్షలు మంజూరు అయ్యాయి, త్వరలో పనులు ప్రారంభం(start) అవుతాయని చెప్పారు.

భువనగిరి పట్టణంలో అన్నిచౌరస్థాల సుందరీకరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. భువనగిరి అభివృద్ధి పై అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్, నేషనల్ హైవే(National Highway) డీఈ, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జగదేవ్ పూర్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాధాలపై అధికారులతో మాట్లాడి ఆ రోడ్డుపై ఒక నివేదిక ఇయ్యాలని ఎమ్మెల్యే(MLA) కోరారు. భువనగిరి పుర ప్రముఖులు వివిధ పార్టీ నాయకులతో సమావేశమై ప్రతి ఒక్క సమస్యపై చర్చించి భువనగిరిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు.

Leave a Reply