Rs. 5 lakh | కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి భూమి పూజ

Rs. 5 lakh | కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి భూమి పూజ
Rs. 5 lakh | సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు ) మండలంలోని పంగిడి పంచాయతీలో గల పెద్దదోబా లో సోమవారంకమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం గత ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే అత్రంకు ప్రతిపాదనలు పంపడంతో షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. అనంతరం సర్పంచ్ మీరా జాలింషా గ్రామంలో సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో నీటి సమస్య ఇతర సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జంగు, పంచాయతీ కార్యదర్శి ఫారుక్, గ్రామ పటేల్ కుమ్ర సోనే రావు, తదితరులు పాల్గొన్నారని తెలిపారు.
