Rs. 4,800 cash | అచ్చంపేటలో పేకాట దందాపై పోలీసుల దాడి

Rs. 4,800 cash | అచ్చంపేటలో పేకాట దందాపై పోలీసుల దాడి
9 మంది అరెస్ట్, 2 పరారీ…
Rs. 4,800 cash | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణ పరిధిలోని ఉప్పునుంతల రోడ్డులో ఉన్న ఓ ఇంటిలో నడుస్తున్న పేకాట దందాపై పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్(Saddam Hussein) తెలిపారు.
అక్రమంగా పేకాట ఆడుతున్న సమాచారం మేరకు ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు దాడి చేసి అక్కడ ఉన్న 9 మందిని(9 people) అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారివద్ద నుంచి రూ.4,800 నగదు(Rs. 4,800 cash), ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, అక్కడి నుంచి మరో ఇద్దరు వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారని ఎస్సై తెలిపారు.
మొత్తం 11 మందిపై ఇండియన్ గేమింగ్ యాక్ట్(Indian Gaming Act) క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
