Rs. 2,830 crores | కంట్రోల్ రూమ్ రెడీ

Rs. 2,830 crores | కంట్రోల్ రూమ్ రెడీ

  • 1967 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్
  • మంత్రి నాదెండ్ల మనోహర్

Rs. 2,830 crores | విజయవాడ,ఆంధ్రప్రభ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌(Kharif season)లో రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11,93,743 టన్నుల ధాన్యం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రూ. 2,830 కోట్లు(Rs. 2,830 crores) జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్(Control room) ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. 1967 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ అందుబాటులోకి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏ సమస్యైనా వెంటనే తెలియజేయడానికి 1967 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ నంబర్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు.

టోకెన్ రావడంలో ఆలస్యం, ఆర్ఎస్ కే /మిల్లులో తూకం సమస్యలు, ఎఫ్‌టిఒ పెండింగ్, రవాణా లేదా గోనె సంచుల కొరత, ఏదైనా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు ఆగిపోవడం… తదితర సమస్యలపై 1967 కి కాల్ చేయవచ్చు అన్నారు. కాల్ చేసే ముందు రైతులు ఈ వివరాలు సిద్ధం చేసుకోవాలి.

ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్(registration no), టోకెన్ నెంబర్, గ్రామం పేరు,ఆర్ఎస్కే వివరాలు కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదును నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపబడుతుంది. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అధికారులు ఫాలోఅప్ చేస్తానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై అధికారులు మండలాల వారీగా రైతులు, రైస్ మిల్లర్లు, ఆర్ఎస్కే నిర్వాహకులను ఫోన్ ద్వారా సంప్రదించి ధాన్యం కొనుగోలు సమస్యలను తెలుసుకుని తక్షణ సూచనలు అందిస్తున్నారన్నారు.

కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్ గోవిందరావు ఐఏఎస్, సివిల్ సప్లై అడ్మిన్ మేనేజర్ శిరీష , కంట్రోల్ రూమ్ ఉద్యోగులు ఉన్నారు.

Leave a Reply