మంగళగిరిలో రోడ్డు ప్రమాదం

మంగళగిరిలో రోడ్డు ప్రమాదం
- గుర్తు తెలియని వ్యక్తి మృతి
(మంగళగిరి, ఆంధ్రప్రభ) : మంగళగిరి (Mangalagiri) పట్టణ పరిధిలోని రత్నాల చెరువు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి వయస్సు 25 నుంచి 28 సంవత్సరాల మధ్యగా ఉండవచ్చని తెలిపారు.
అతడు ఎర్రరంగు టిషర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి గుర్తింపు ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు (police) తెలిపారు. ఆయన్ని ఎవరైనా గుర్తుపట్టిన యెడల మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగలరని పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ విజ్ఞప్తి చేశారు.

