ఘోర రోడ్డు ప్రమాదం – మూడేళ్ళ బాలిక మృతి

ఘోర రోడ్డు ప్రమాదం – మూడేళ్ళ బాలిక మృతి
బాపులపాడు, ఆంధ్రప్రభ : బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ పంచాయతీ ఆఫీసు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సోమవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మూడు సంవత్సరాల బాలిక మృతి చెందింది. బైక్ మీద వెళ్తున్న వారిని లారీ ఢీకొనడంతో వ్యక్తికి గాయాలు కాగా, మూడు సంవత్సరాల బాలిక మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు వీరవల్లి, హనుమాన్ జంక్షన్ పోలీసు సిబ్బంది సేకరిస్తున్నారు. లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి రియాల్షి దుర్మరణం చెందింది.
తిరుపతమ్మ తల్లి గుడి నుండి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. చిన్నారి పై నుంచి లారీ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో మేనమామ సునీల్‌కు స్వల్ప గాయాలు కాగా, ఘటనా స్థలం నుండి లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు.ఆర్.పి.ఎచ్ కాలనీలో రోదనలు మిన్నంటాయి. ప్రమాద స్థలానికి
హనుమాన్ జంక్షన్ సిఐ, వీరవల్లి ఎస్ఐ చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

