RIP | జానపద గాన కోకిల సుక్రి బొమ్మగౌడ కన్నుమూత
మంగళూరు , కర్ణాటక : జానపద పాటల కోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుక్రి బొమ్మగౌడ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 88 ఏళ్ల సుక్రాజీ నేటి తెల్లవారుజామున 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
సుక్రాజ్జీగా పిలువబడే సుక్రిబొమ్మగౌడ ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకాకు చెందిన వారు. గత కొన్ని నెలలుగా ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్షిణించటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించాఉ. మంగళూరు నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే ఇవాళ ఉదయం తెల్లవారుజామున కన్నుమూశారు.
ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకాలోని బడిగేరి గ్రామ నివాసి. హలక్కి వోక్కలిగ తెగలో జన్మించిన సుక్రి బొమ్మ గౌడను జానపద కోకిల అని కూడా పిలుస్తారు. ఇప్పుడా జానపద కోకిల గానం మూగబోయింది.
సుక్రి బొమ్మగౌడ చిన్నతనంలో తన తల్లి నుండి జానపద పాటలు నేర్చుకున్నారు. జానపద పాటలు, హలక్కి వోక్కలిగ తెగ సాంప్రదాయ సంగీత పాటలను కాపాడటానికి కృషి చేశారు. వారు పాటలలో మాత్రమే కాకుండా, వివిధ సామాజిక పోరాటాలలో కూడా ముందంజలో ఉండేవారు.
గిరిజన హలక్కీ సమాజాన్ని షెడ్యూల్డ్ తెగలలో చేర్చకపోతే, తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. వారు తమ ప్రజల హక్కుల కోసం విధానసౌధ వద్ద నిరసన తెలుపుతామని కూడా హెచ్చరించారు.
చెట్ల తల్లిగా పిలువబడే పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ మరణం తరువాత, ఇప్పుడు అదే ప్రాంత జానపద కోకిలగా పిలువబడే పద్మశ్రీ అవార్డు గ్రహీత సుక్రి బొమ్మగౌడ కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన తులసి గౌడ, సుక్రి బొమ్మ గౌడ ఇద్దరూ హలక్కి సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు ఆ సంఘం ఈ ఇద్దరు వృద్ధులను కోల్పోయింది. ఇప్పుడు, తులసి గౌడ అడుగుజాడల్లో నడుస్తూ, హలక్కి సంఘం సుక్రి బొమ్మగౌడను కోల్పోయింది.