నిరుపేద కుటుంబానికి బియ్యం అందజేత

చిట్యాల, ఆంధ్రప్రభ ; చిట్యాల మండలంలోని నేరడ గ్రామానికి చెందిన కాసోజు ఈశ్వరమ్మ ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సంస్థ తరఫున 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపత్కాలంలో ఉన్న ప్రజలకు తోడుగా ఉండటం ఆసరా సంస్థ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గడగోజు ఎల్లా చారి, శంకరాచారి, గణేష్ రాములు,తదితరులు పాల్గొన్నారు.
