Revanth Reddy | అసెంబ్లీలో భట్టివిక్రమార్క, మండలిలో ఉత్తమ్…

Revanth Reddy | అసెంబ్లీలో భట్టివిక్రమార్క, మండలిలో ఉత్తమ్…

Revanth Reddy | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. కీలక ప్రాధాన్యత రంగాలపై దృష్టి సారిస్తూ ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈసారి బడ్జెట్‌లో విద్య, వైద్యం, సంక్షేమం, ఇరిగేషన్‌కు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. 2026-27 వార్షిక బడ్జెట్‌ను సుమారు రూ.3,36,000 కోట్ల వరకు ప్రవేశపెడుతున్నారని అంచనా వేస్తున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply