ఓటు చోరీతో ఫ‌లితాల‌ను తారుమారు

ఓటు చోరీతో ఫ‌లితాల‌ను తారుమారు

హుస్నాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీతో ఫలితాలను తారుమారు చేసి దొడ్డి దారిన గద్దెనెక్కారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. ఈ రోజు ఓటు చోరీ పై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన ఓట్ చోరీ ర్యాలీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని అనభేరి చౌరస్తా(Anabheri Crossroads) నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఓటు చోరీ తోనే ఉత్తర భారత దేశంలో బీజేపీ(BJP) ప్రభుత్వం పాగా వేయగలుగుతుందని దక్షిణ భారతదేశంలో సైతం ఈ పాలసీని అమలు చేయాలని చూస్తుందని అన్నారు. ఓటు ప్రాముఖ్యతపై, ఓట్ చోరీపై ప్రజలకు తెలియజేయడానికే ఓట్ ర్యాలీ, సంతకాల సేకరణ నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ హౌస్ ఫేడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి(Bomma Sriram Chakravarthy), సిద్దిపేట జిల్లా గ్రంధాలయం చైర్మన్ కేడం లింగమూర్తి. సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply