రైతులను ఇబ్బంది పెట్టిన ఫలితం..

  • మూడు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలకు సర్కారు రాయతీలు రద్దు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మామిడి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా రైతులను ఇబ్బంది పెట్టిన చిత్తూరు జిల్లాలోని మూడు మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం నుంచి అందే రాయితీలను నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ వెల్లడించారు.

మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మామిడి సీజన్ లో ఆ మూడు ఫ్యాక్టరీలు జిల్లా యంత్రాంగానికి రైతులకు ఏమాత్రం సహకరించలేదని జిల్లా కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు పర్మిట్లను జారీ చేయడంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాయని అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఐదు రూపాయల కన్నా తక్కువ రైతులకు చెల్లించిన ఫ్యాక్టరీలకు ప్రభుత్వ రాయితీలు నిలుపుదల చేస్తున్నట్లు వివరించారు.

Leave a Reply