నేషనల్ హైవేపై ప్లాస్టిక్ వ్యర్ధల తొలగింపు..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జుక్కర్ మండలంలోని నేషనల్ హైవేపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థలను జుక్కల్ ఎంపీఓ రాము ఆధ్వర్యంలో తొలగించారు. కౌలాస్, మొహ్మదాబాద్, కేంరాజ్ కల్లాలి గ్రామాల శివర్ల మీదుగా సంగారెడ్డి-అకోల నేషనల్ హైవే కొనసాగుతుంది. దీంతో ఈ మూడు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొని కిలోమీటర్ల మేర రోడ్డుపై ఉన్న వ్యర్థాలను తొలగించి రోడ్డును శుభ్రపరచడం జరిగింది.

Leave a Reply