Guillain-Barre syndrome: హైదరాబాద్ కు వ‌చ్చేసిన ఆ వ్యాధి..

మహారాష్ట్రలో ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) హైదరాబాద్‌కూ పాకింది. నగరంలో తొలి కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది.

మహారాష్ట్రలో ఇప్పటికే వందకుపైగా జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సిండ్రోమ్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది సోకిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున సొంత నరాల వ్యవస్థపైనే దాడిచేస్తుంది.

జీబీఎస్ సోకిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపిస్తుంది. కండరాలు బలహీనంగా మారుతాయి. డయేరియా, పొత్తికడుపులో నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. అయితే, ఇది అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం అవుతుందని వివరించారు.

Leave a Reply