20వరకు ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ ఫీజుల చెల్లింపు…

20వరకు ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ ఫీజుల చెల్లింపు…
మే 13 నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు
జిల్లా విద్యాశాఖ అధికారి రవికుమార్
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో సప్లిమెంటరీ పరీక్ష ఫీజును చెల్లించవచ్చని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. అలాగే రీకౌంటింగ్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు రూ.100 రుసుము, రీవాల్యుయేషన్ స్కాన్ కాపీ కోసం రూ.800 ఫీజును మీ సేవ ద్వారా ఈనెల 13 నుంచి 20వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన వివరించారు.
రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష ఫీజును కూడా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు సప్లిమెంటరీ పరీక్ష ఫీజులు చెల్లించిన విద్యార్థులకు మే 13వ తేదీ నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించబడతాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు.
