బెంగళూరు : ఈరోజు బెంగళూరు వేదికగా ఆర్సీబీ – పంజాబ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించడంతో ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే, మ్యాచ్ ను 14 ఓవర్లకు కుందించారు ఎంపైర్లు. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 9వికెట్ల నష్టానికి 95 పరుగులు సాధించింది.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీని మరోసారి దురదృష్టం వెంటాడింది. హోం గ్రౌండ్ లో పంజాబ్ తో జరుగుతున్న టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు ఆదిలోనే షాకులు తగిలాయి. అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల బ్యాటింగ్ కష్టమైంది. దీంతో కీలక బ్యాటర్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
ఈ క్రమంలో ఆర్‌సిబి ఇన్నింగ్స్‌ను మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ కాపాడాడు. 60 పరుగులకే ఆలౌట్ అవుతుందని భావించిన జట్టును తన అద్భుతమైన బ్యాటింగ్‌తో టిమ్ డేవిడ్ ఆదుకున్నాడు. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) అర్ధ సెంచరీతో బెంగళూరు స్కోరు 95 పరుగులకు చేరుకుంది. ఇక కెప్టెన్ రజత్ పటీదర్ 23 తో పరువాలేదనిపంచాడు.
పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, చాహల్, హర్‌ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో పంజాబ్ జట్టు 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.