బెంగళూరు వెదికగా గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో…. ఆర్సీబీ తీవ్ర కష్టాల్లో పడింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆర్సీబీ దూకుడుకు గుజరాత్ బ్రేకులు వేయడంతో.. బెంగళూరు జట్టు 6.2 ఓవర్లలో కేవలం 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
గత మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లీ (7), దేవ్‌దత్ పడిక్కల్ (4), ఫిలిప్ సాల్ట్ (14), కెప్టెన్ రజత్ పాటిదార్ (12) అందరూ స్వల్ప పరుగులకే పెవిలియన్ కు క్యూ కట్టారు.
ఇప్పటివరకు మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మలు తలా ఒక వికెట్ తీశారు.