యాదాద్రి ఆలయ ఈవోగా..

యాదాద్రి ఆలయ ఈవోగా రవినాయక్‌

వ్యక్తిగత సెలవులో వెళ్లిన ఈవో వెంకట్రావు


యాదాద్రి భువనగిరి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణా తిరుపతిగా దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతున్న యాదగిరికొండపై కొలువై, కలియుగ ఇతిబాధలు తీర్చే శ్రీలక్ష్మీ నర్సింహ స్వామి సేవకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ మెంబర్‌ సెక్రెటరీ జీ.రవినాయక్‌ సిద్ధమవుతున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకట్రావు (Venkat Rao) తన వ్యక్తిగత అవసరాల రీత్యా నెలరోజుల పాటు సెలవులో వెళ్తుండగా, ఆయన స్థానంలో పూర్తిస్థాయి ఇన్‌చార్జి ఈవోగా రవినాయక్‌ (in-charge EO Ravi Nayak) ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేసిన అనుభవం రవినాయక్‌కు ఉండటంతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వేలాదిమంది భక్తుల రాకపోకలు, వీఐపీల తాకిడితో కిటకిటలాడే యాదాద్రి, దసరా సెలవుల నేపథ్యంలో మరింత భక్తజన సందోహంతో నిండి ఉండే అవకాశాలున్న నేపథ్యంలో యువ ఐఏఎస్‌కు ఆలయ బాధ్యతలను అప్పగించడం, ఆయన పనితీరుపై ప్రభుత్వ పెద్దలకున్న నమ్మకానికి నిదర్శనమని పలువురు కొనియాడుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం ఆలయ ఇన్‌చార్జి ఈవోగా రవి నాయక్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply