Ration Card | నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ పూర్తి చేయాలి

Ration Card | నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ పూర్తి చేయాలి
- గజ్వేల్‌లో మార్కెట్ కాంపౌండ్‌వాల్ కు మంత్రి వివేక్ శంకుస్థాపన
Medak | గజ్వేల్, ఆంధ్రప్రభ : నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి జి.వివేక్ వెంకట స్వామి(Minister G. Vivek Venkata Swamy) అన్నారు. ఈ రోజు గజ్వేల్ పట్టణంలోని కోటీ 5 లక్షలతో న్యూ పత్తి మార్కెట్‌లో కాంపౌండ్ వాల్(Compound Wall) నిర్మాణానికి , రూ.మూడు కోట్లతో సమీకృత మార్కెట్ లోదుకాణ సముదాయాల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గజ్వేల్ మార్కెట్(Gajwel Market) సంస్థకు ఆదాయం చేకూర్చడం కోసం దుకాణాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిధులు మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డుల(5 lakh new ration cards)ను అందజేశామన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. సిద్దిపేట పట్టణంలో రోల్ మెడల్(Roll Medal) గా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో చాలా వేగంగా పూర్తి చేస్తున్నందుకు కలెక్టర్ కు అభినందించారు.
సన్న బియ్యం బోనస్(Rice Bonus) కోసం రైతులు అందరూ ఎదురు చూస్తున్నారని, అతి త్వరలో రైతుల అకౌంట్లో బోనస్ నిధులు మంజూరు చేయబోతున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి(MLC Yadava Reddy) మాట్లాడుతూ గజ్వేల్ లో రెండు బస్టాండ్ పనులు చివరి దశలో ఉన్నాయని, వాటి పైన దృష్టి సారించి పూర్తి చెయ్యాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
