ఘనంగా మెట్టుగుట్ట రాములవారి రథోత్సవం..

ఘనంగా మెట్టుగుట్ట రాములవారి రథోత్సవం..

కాజీపేట, ఆంధ్ర ప్రభ : కాజీపేట మండలం మడికొండలో దక్షిణ కాశీగా పేరుగాంచిన మెట్టుగుట్ట పైగల మెట్టు రామలింగేశ్వర స్వామి, సీతారామ చంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సీతారాముల రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం రథం పై సీతారాములను మడికొండ పురవీధుల్లో కోలాట నృత్య ప్రదర్శనలతో,డప్పు చాపుల్ల మధ్య ఊరేగింపు జరిపారు,భక్తులు మంగళహారతులతో స్వామి వారికి స్వాగతం పలికారు, ఈ సందర్భంగా రథోత్సవం కూడా చైర్మన్,హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇనగల వెంకట్రామి రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ, దేవాలయ కమిటీ సభ్యులు సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వాణా అధికారి సత్యనారాయణ, రామాలయం ఉత్సవ కమిటీ చైర్మెన్ పల్లపు అర్జున్, అర్చకులు రాగిచేడు అభిలాష్ శర్మ , పరాశరం విష్ణు వర్ధనాచార్యులు, పారుపల్లి సత్యనారాయణ శర్మ, రాజరాజేశ్వర స్వామి సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply