raashii khanna| సొట్ట బుగ్గ‌ల సుంద‌రి.. సొగ‌సు!

raashii khanna| సొట్ట బుగ్గ‌ల సుంద‌రి.. సొగ‌సు!

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, జై లవకుశ , రాజా ది గ్రేట్ లాంటి ప‌లు టాలీవుడ్ సినిమాలో న‌టించిన సొట్ట బుగ్గ‌ల సుంద‌రి రాశి ఖన్నా 2017లో తొలిసారి విలన్ అనే చిత్రంలో నటించి మలయాళ సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం ఇలా పలు చిత్రాలు చేసిన రాశిఖన్నా చివరిగా 2022లో వచ్చిన థాంక్యూ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక తమిళ్, హిందీ చిత్రాలలోనే నటిస్తూ బిజీగా మారింది. ఈమె మళ్లీ 2025లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన తెలుసు కదా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ.

Leave a Reply