Ramzan | ముస్లింల‌కు ప‌విత్రం..

Ramzan | ముస్లింల‌కు ప‌విత్రం..

Ramzan, భవానిపురం, ఆంధ్రప్రభ : రంజాన్ మాసం ముస్లిం సోద‌రుల‌కు ఎంతో పవిత్ర‌మైన‌ది. ఈ మాసం మొత్తం అత్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఉప‌వాసం వుంటూ ప్రార్థ‌న‌లు చేస్తారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం సోదరులందరితో పాటు రాష్ట్ర ప్రజల పై ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన హలీం స్టాల్స్ ను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సందర్శించారు.

మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కార్యాల‌య కార్యాద‌ర్శి ప్ర‌త్తిపాటి శ్రీధ‌ర్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లా, ఉమ్మ‌డి కృష్ణాజిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ ఎమ్.ఎస్ బేగ్ బుధ‌వారం రాత్రి ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. నాయ‌కుల‌తో క‌లిసి ప్రతి స్టాల్ వ‌ద్దకు వెళ్లి ఆ స్టాల్ యాజ‌మానుల‌తో మాట్లాడారు. సలీమ్ హాలీమ్ సెంట‌ర్ తో పాటు కొన్ని హ‌లీమ్ సెంట‌ర్స్ ను నాయ‌కుల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రారంభించారు. అనంతరం నాయ‌కుల‌తో క‌లిసి హాలీమ్ తో పాటు బిర్యానీ రుచి చూశారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ.. ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి రంజాన్ మాసం ప్రారంభం సందర్బంగా క‌నిపించే నెల‌వంకను చూడ‌టం ఎంతో ఆనందంగా వుంద‌న్నారు. మ‌తసామ‌ర‌స్యానికి ప్ర‌తీక విజ‌య‌వాడ న‌గ‌రమ‌ని.. ఈ న‌గ‌రంలో అన్ని కుల‌, మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు వున్నార‌న్నారు. గ‌త వందేళ్ల నుంచి విజ‌య‌వాడ న‌గరంలో స్థిర‌ప‌డిన ముస్లిం సోద‌రులు న‌గ‌రాభివృద్దికి ఎంతో కృషి చేశార‌ని కొనియాడారు. న‌గ‌రాభివృద్దిలో వారంతా భాగంగా నిలిచార‌న్నారు.

హైద‌రాబాద్ లోనే కాదు గ‌త 30 ఏళ్ల నుంచి పంజా సెంట‌ర్ లోని హాలీమ్ చాలా ప్ర‌సిద్ధి పొందిందన్నారు. ప్ర‌తి ఏడాది ఇక్క‌డ‌కి రావ‌టం ఒక అన‌వాయితీగా జ‌రుగుతుంద‌న్నారు. ముస్లిం సోద‌ర‌ల‌కు రంజాస మాస ప్రారంభం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కార్యాల‌య కార్యాద‌ర్శి ప్ర‌త్తిపాటి శ్రీధ‌ర్ మాట్లాడుతూ ముస్లిం సోద‌ర‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Leave a Reply