బెజ్జంకి మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని అన్ని గ్రామాల్లో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక నమాజులు నిర్వహించి, పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్న పెద్దలు, యువకులు ఒకేచోట కూడి ఆనందంగా పండుగను జరుపుకున్నారు.
పండుగ సందర్భంగా మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, గ్రామాల్లో స్నేహభావం, సౌహార్ద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పెద్దలు యువతకు సద్భావన, సేవా భావం, పరస్పర గౌరవం గురించి సందేశాలు ఇచ్చారు. గ్రామ ప్రజలు కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగలో భాగస్వామ్యం అయ్యారు.
