Ramesh | ఒక్క అవకాశం ఇవ్వండి..

Ramesh | ఒక్క అవకాశం ఇవ్వండి..
గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా..
సర్పంచ్ అభ్యర్థి జాదవ్ రమేష్
Ramesh | ఆంధ్రప్రభ, గుడిహత్నూర్ : గ్రామపంచాయతీ పరిధిలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడతానని సర్పంచ్ అభ్యర్థి జాదవ్ రమేష్ తెలిపారు. ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని అన్నారు. గ్రామంలో యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పనిచేస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతానని రమేష్ అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
