Ramannapet | స‌ర్పంచ్ సొంత నిధుల‌తో..

Ramannapet | స‌ర్పంచ్ సొంత నిధుల‌తో..

  • పాఠ‌శాల‌లో స్టేజి నిర్మాణం
  • ఇచ్చిన హామీని నెరవేస్తున్న సర్పంచ్
  • కునూరు సాయికుమార్ గౌడ్

Ramannapet | రామన్నపేట, ఆంధ్రప్రభ : మండలంలోని బోగారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇచ్చిన మాట ప్రకారం… స్టేజి నిర్మాణానికి తన సొంత నిధులతో సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన ఊరు – మనబడి అనే ఉద్దేశంతో ఈ పాఠశాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో ఈ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని, భవిష్యత్తులో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తానని పలు హామీలు ఇచ్చారు.

Leave a Reply