పరకాలలో ఘనంగా రంజాన్ వేడుకలు..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలో రంజాన్ పర్వదిన వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. శనివారం రోజు రంజాన్ పర్వదినం పురస్కరించుకొని పట్టణంలోని హుజురాబాద్ రోడ్ లో గల ఈద్గా మసీదులో మత గురువుల (ఇమామ్ సాబ్స్) ఆధ్వర్యంలో పెద్దలు, చిన్నారులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఒకరికొకరు అలాయి బలాయి తీసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని బిఆర్ఎస్ నాయకులు ఈద్గా మజీద్ కు వెళ్లి ముస్లిం సోదరులను కలుసుకొని అలాయిబలాయి తీసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రార్ధనల అనంతరం ముస్లిం సోదరులు పట్టణంలోని కబరస్థాన్కు వెళ్లి వారి పూర్వీకుల సమాధుల వద్ద పూలు చల్లి ప్రార్థనలు నిర్వహించారు.

Leave a Reply