Rally | ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించండి..!
- వందలాది ట్రాక్టర్లతో “ఖని”లో ప్రదర్శన
- మా కుటుంబాలను కాపాడాలంటూ నిరసన
Rally | గోదావరిఖని, ఆంధ్రప్రభ : ఇసుక ఉచితంగా ఇవ్వాలని… ఆ పాలసీని పునరుద్ధరించాలని శుక్రవారం గోదావరిఖని(Godavari River) పట్టణంలో ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ (Large-scale rally) చేపట్టారు. స్థానిక ఆర్సీఓ క్లబ్ ఏరియా నుండి వందలాది ట్రాక్టర్లతో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించాలని ట్రాక్టర్లకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ట్రాక్టర్ యజమానులు ఉచిత ఇసుక పాలసీని కొనసాగించాలని ప్రదర్శించారు. ప్రతిపక్ష నాయకుల అసత్యపు ఆరోపణల(False accusations) మూలంగా తమ కుటుంబాలు ఆగమవుతున్నాయని ట్రాక్టర్ యజమానులు(Tractor owners) నినాదాలు చేశారు. ఉచిత ఇసుక పాలసీని రద్దు చేయడంతో కష్టాల బారిన పడుతున్నామని ట్రాక్టర్ యజమానులు ఈ సందర్భంగా గగ్గోలు పెట్టారు. తమ కుటుంబాలను కాపాడాలంటూ ప్లే కార్డులతో ట్రాక్టర్ యజమానులు నిరసనకు దిగారు.
ప్రధాన రహదారులపై నిరసన ప్రదర్శన కొనసాగింది. ఉచిత ఇసుక పాలసీని కొనసాగించేంతవరకు తమ నిరసన కొనసాగుతోందని ట్రాక్టర్ యజమానులు తేల్చి చెప్పారు. గోదావరిఖని పట్టణం నుండి రాజీవ్ రహదారి(Rajiv Road)పై ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ కొనసాగింది. ఎన్టీపీసీ మీదుగా రామగుండం తహసీల్దార్(Tahsildar) కార్యాలయం చేరుకొని అక్కడ అధికారులకు ఉచిత ఇసుక పాలసీని కొనసాగించాలని వినతి పత్రం అందజేయబోతున్నట్లు ట్రాక్టర్ యజమానులు స్పష్టం చేశారు.

