Rajya Sabha | లోక్‌సభ గ్రీన్ సిగ్నల్…

Rajya Sabha | లోక్‌సభ గ్రీన్ సిగ్నల్…
Rajya Sabha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికు చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో ఈ కీలక బిల్లు తదుపరి ఆమోదం కోసం రాజ్యసభకు వెళ్లనుంది.
బిల్లుపై జరిగిన చర్చలో పలువురు మంత్రులు, ఎంపీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. ఇక వైఎస్సార్సీపీ అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే ప్రస్తుత బిల్లును వ్యతిరేకించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
