Rajini | ఆ ఘటనపైనే…

Rajini | ఆ ఘటనపైనే…

Rajini | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదైంది. ఆమెతో పాటు మరో 21మంది వైసీపీ నాయకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 30వ తేదీన విడదల రజని అనుచరులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.

Leave a Reply