SS Rajamouli | రాజకీయాల్లోకి రాజమౌళినీ..?

SS Rajamouli | రాజకీయాల్లోకి రాజమౌళినీ..?
SS Rajamouli హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాజమౌళి.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ వైపు బాలీవుడ్ చూసేలా చేస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేసిన ఒకే ఒక్కడు మన రాజమౌళి. ఇప్పుడు ఈ దర్శకధీరుడు.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నారు..? అసలు కథ ఎలా ఉండబోతుంది…? అనేది తెలియచేసేలా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయడం.. రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించడం తెలిసిందే. అయితే.. ఆ ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. అక్కడ నుంచి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అలా వచ్చిందే రాజకీయాల్లోకి.. రాజమౌళి. మరి.. సినిమాయే ప్రపంచంగా బ్రతికే రాజమౌళి నిజంగా రాజకీయాల్లోకి వస్తారా..? అసలు వార్తల వెనకున్న వాస్తవం ఏంటి..?
SS Rajamouli | ఈ పంచాయితీ ఫిల్మ్ ఛాంబర్ కి
మహేష్ తో రాజమౌళి తీస్తున్న మూవీ టైటిల్ వారణాసి. ఈ టైటిల్ ముందుగానే లీకైంది కానీ.. ఈ టైటిల్ పెట్టరేమో అనుకున్నారు. ఆఖరికి లీకైన టైటిలే పెట్టేసారు. అయితే.. ఈ టైటిల్ ముందగానే హనుమా క్రియేషన్స్ బ్యానర్ పై డైరెక్టర్ సుబ్బారెడ్డి రిజిష్టర్ చేయించారని వార్తలు వచ్చాయి. ఆయన ఈ సినిమా టైటిల్ ను అలాగే వారణాసి టైటిల్ తో పోస్టర్ ను ఆమధ్య ప్రకటించడం కూడా జరిగింది. మరి.. రాజమౌళి ఈ టైటిల్ గురించి పట్టించుకోలేదో.. లేకపోతే వాళ్లను రిక్వెస్ట్ చేస్తే.. వాళ్లు టైటిల్ ఇచ్చేస్తారులే అనుకున్నారో ఏమో కానీ.. జక్కన్న వారణాసి అనే టైటిల్ ప్రకటించగానే టైటిల్ వివాదస్పదం అయ్యింది. ఇప్పుడు ఈ పంచాయితీ ఫిల్మ్ ఛాంబర్ కి చేరింది.
ఇక అసలు విషయానికి వస్తే.. రాజమౌళికి తండ్రి విజయేంద్రప్రసాద్, భార్య రమా.. ఇద్దరూ కూడా ఏమీ టెన్షన్ పడకు.. అంతా హనుమా చూసుకుంటాడు అని చెప్పేవారట. అయితే.. ఈవెంట్ జరుగుతున్న టైమ్ లో ఒక డ్రోన్ సరిగా వర్క్ చేయలేదు. దాని వలన టైటిల్ అనౌన్స్ మెంట్ లో చిన్న ఇబ్బంది ఏర్పడింది. అది రాజమౌళికి కోపం తీసుకువచ్చింది. వేదిక పై జక్కన్న మాట్లాడుతూ.. హనుమా చూసుకుంటారు అని చెప్పారు. ఇదేనా చూసుకోవడం అంటే.. అంటూ తనదైన స్టైల్ లో తన బాధను బయటపెట్టారు. ఇక అక్కడ నుంచి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ హిందూ సంఘాలు, అలాగే కొంత మంది ఆయన పై ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

SS Rajamouli |ఎక్కడపడితే అక్కడ.. ఇష్టం వచ్చినట్టు
కొన్ని సంఘాలు అయితే.. ఇంకో అడుగు ముందుకు వేసి కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే.. ఎవరు కేసులు పెట్టినా జక్కన్న మాత్రం జడిసే రకం కాదు. కొంత మంది రాజకీయ నాయకులు అయితే.. రాజమౌళికి మనసు మారాలని.. దేవుడు ఉన్నాడనే ఫీలింగ్ ఆయనకు కలిగించాలని.. ఇలా రకరకాలుగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజకీయల్లోకి రాజమౌళి అనే మాట వినిపిస్తుంది. కాదేదీ కవితకు అనర్హం అన్నట్టుగా.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది పడితే అది.. ఎక్కడపడితే అక్కడ.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. తన పై కేసులు పెడుతుండడం.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండడంతో.. రాజమౌళి భవిష్యత్ లో రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నాడు అంటూ ప్రచారం మొదలైంది.
మరి.. నిజంగా రాజమౌళి రాజకీయాల్లోకి వస్తారా అంటే.. ఆయన గురించి తెలిసినవాళ్లు రారనే చెబుతారు. ఎందుకంటే ఆయనకు సినిమాలు ప్రపంచం. ఆయన డ్రీమ్ మహా భారతాన్ని తెరకెక్కించడం. ఈ సినిమాను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఓ పది భాగాలుగా చేయాలనే సంకల్పంతో ఉన్నారు.
మహాభారతాన్ని ఎవరు ఎన్ని సార్లు తెరకెక్కించినా మళ్లీ తీయచ్చు. ఎవరి స్టైల్ లో వాళ్లు తీయచ్చు. ఇప్పుడు టెక్నాలిజీ మారింది. ఇంకా చెప్పాలంటే.. బాగా డెవలప్ అయ్యింది. జక్కన్న టెక్నాలిజీని ఉపయోగించుకోవడంలో దిట్ట. అలాగే కథను రక్తికట్టేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. మహా భారతాన్ని తెరకెక్కిస్తానని.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ కూడా దాని కోసం చేస్తున్న రిహార్సల్ లాంటివి అని చెబుతుంటారు. మహేష్ బాబుతో చేస్తున్న మూవీకే 1300 కోట్లు బడ్జెట్ అంటే.. మహా భారతానికి ఎంత బడ్జెట్ పెడతారో ఊహించుకోవచ్చు. పైగా అది పది భాగాలు తెరకెక్కించాలంటే.. చాలా టైమ్ పడుతుంది.
ఆయన ఒక్కో సినిమాకే రెండు మూడేళ్లు తీసుకుంటుంటే.. మహా భారతాన్ని 10 భాగాలుగా తీయాలంటే ఎంత టైమ్ పడుతుందో ఊహించుకోవచ్చు. అందుచేత జక్కన్న పది భాగాలు కాస్తా 5 భాగాలుగా తీస్తానని చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మహా భారతం కోసం స్క్రిప్ట్ వర్క్ ను విజయేంద్రప్రసాద్ స్టార్ట్ చేశారని తెలిసింది. మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి మూవీని 2027లో రిలీజ్ చేయనున్నారు. ఆతర్వాత జక్కన్న చేసే సినిమా మహా భారతం అంటూ టాక్ వినిపిస్తుంది. వారణాసి రిలీజ్ తర్వాత క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
మరి.. నిజంగా రాజమౌళి రాజకీయాల్లోకి వస్తారా అంటే.. ఆయన గురించి తెలిసినవాళ్లు రారనే చెబుతారు. ఎందుకంటే ఆయనకు సినిమాలు ప్రపంచం. ఆయన డ్రీమ్ మహా భారతాన్ని తెరకెక్కించడం. ఈ సినిమాను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఓ పది భాగాలుగా చేయాలనే సంకల్పంతో ఉన్నారు.

మహా భారతాన్ని ఎవరు ఎన్ని సార్లు తెరకెక్కించినా మళ్లీ తీయచ్చు. ఎవరి స్టైల్ లో వాళ్లు తీయచ్చు. ఇప్పుడు టెక్నాలిజీ మారింది. ఇంకా చెప్పాలంటే.. బాగా డెవలప్ అయ్యింది. జక్కన్న టెక్నాలిజీని ఉపయోగించుకోవడంలో దిట్ట. అలాగే కథను రక్తికట్టేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. మహా భారతాన్ని తెరకెక్కిస్తానని.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ కూడా దాని కోసం చేస్తున్న రిహార్సల్ లాంటివి అని చెబుతుంటారు. మహేష్ బాబుతో చేస్తున్న మూవీకే 1300 కోట్లు బడ్జెట్ అంటే.. మహా భారతానికి ఎంత బడ్జెట్ పెడతారో ఊహించుకోవచ్చు. పైగా అది పది భాగాలు తెరకెక్కించాలంటే.. చాలా టైమ్ పడుతుంది.
ఆయన ఒక్కో సినిమాకే రెండు మూడేళ్లు తీసుకుంటుంటే.. మహా భారతాన్ని 10 భాగాలుగా తీయాలంటే ఎంత టైమ్ పడుతుందో ఊహించుకోవచ్చు. అందుచేత జక్కన్న పది భాగాలు కాస్తా 5 భాగాలుగా తీస్తానని చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మహా భారతం కోసం స్క్రిప్ట్ వర్క్ ను విజయేంద్రప్రసాద్ స్టార్ట్ చేశారని తెలిసింది. మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి మూవీని 2027లో రిలీజ్ చేయనున్నారు. ఆతర్వాత జక్కన్న చేసే సినిమా మహా భారతం అంటూ టాక్ వినిపిస్తుంది. వారణాసి రిలీజ్ తర్వాత క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
మహా భారతం సినిమా తీయడం తప్పితే.. అంతకు మించి ఆయనకు కలలు అంటూ ఏమీ లేవు. అలాగని రాజకీయాలు పట్టించుకోరా అంటే పట్టించుకుంటారు. ఆయనకు లోకసత్తా పార్టీ అంటే ఇష్టం. రాజకీయాలు నిజాయితీగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. కానీ.. ఆయన మాత్రం రాజకీయాల్లోకి రారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. మరి.. ఈ ప్రచారాలకు ఫుల్ పెట్టేలా.. జక్కన్న స్పందిస్తారేమో చూడాలి.
Click Here To Read https://prabhanews.com/famous-bollywood-actor-dharmendra-passed-away-1/నటుడు ధర్మేంద్ర కన్నుమూత
