Rahul Gandhi | బడ్జెట్ ఏం బాగాలేదు

Rahul Gandhi | బడ్జెట్ ఏం బాగాలేదు
- సంక్షోభాలను పట్టించుకోలేదు
- ప్రజల ఆకాంక్షలకనుగుణంగా లేదు
- రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
Rahul Gandhi | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది దేశంలోని వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్ అని ఎక్స్ వేదికగా విమర్శించారు. దేశంలో నెలకొన్న వాస్తవ సంక్షోభాలను కేంద్ర బడ్జెట్ పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ బడ్జెట్ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, ఇది కేవలం కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యలను ఈ బడ్జెట్ విస్మరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘యువతకు ఉద్యోగాలు లేవు, కుంగుతున్న తయారీ రంగం, పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్న ఇన్వెస్టర్లు, సంక్షోభంలో రైతాంగం, అంతర్జాతీయ సంక్షోభాలతో ఎదురవుతున్న ముప్పు.. వీటన్నిటినీ బడ్జెట్‌లో పట్టించుకోలేదు. ఇది తప్పులు సరిదిద్దుకోలేని బడ్జెట్, దేశంలోని వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్’ అని ఎక్స్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు.
