కొనుగోలు కేంద్రం ప్రారంభం
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి(Kammer Palli) మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నితహసిల్దార్ గుడిమేల ప్రసాద్(Gudimela Prasad), పీఎసీఎస్ చైర్మన్ రేగుంట దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి పీఏసీఎస్(PACS) సిద్ధంగా ఉందని అన్నారు.
రైతులు(Farmers) ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు. రైతులు దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని తెలిపారు. రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో(Farmers and Purchase Centres)నే ధాన్యాన్నివిక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో టీ. రమేష్ శ్రీ, ఆర్ఐ శరత్, ఏఈఓ జె.కావ్య, పీఏసీఎస్ కార్యదర్శి యు.శంకర్, కార్య వర్గ సభ్యులు, సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.