పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్తు..

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్తు..

జిల్లా వ్యాప్తంగా 130 పరీక్షా కేంద్రాల ఏర్పాటు..
పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది తప్ప ఇతరుల వ్యక్తులు ఉండరాదు ఉంటే కేసులు నమోదు..
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్…
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 130 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు నిర్వహించనున్న రు. ఈ సందర్భంగా పరీక్షలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదివారం తెలిపారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరుపున అన్ని పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు.

  • పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పోలీ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
  • పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
  • పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాలు ఆవరణలో బయట వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయిస్తున్నామని తెలిపారు.
  • జిల్లా వ్యాప్తంగా ఉన్న 130 పరీక్ష కేంద్రాలలో సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
  • ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశించారు.
  • ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. అందుకు అనుగుణంగా నియంత్రణ కోసం పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
  • పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులతో పాటు పరీక్ష విధులు నిర్వహించే అన్ని శాఖల సిబ్బంది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
  • పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు , పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది లేదా వ్యక్తులు ఉండరాదు అన్నా అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తుందని హెచ్చరించారు.
  • మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు విద్యార్థులు ఎవరైనా పాల్పడినా, లేదా వారికి ఎవరైనా సహకరించినా, వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పరీక్షా కేంద్రాలు వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు కూడా సహకరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Leave a Reply