ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల హవా…

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల హవా…

చిట్యాల, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వెలువడిన ఫలితాలలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ బి శ్రీదేవి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బి శ్రీదేవి మాట్లాడుతూ… విద్యార్థుల ఫలితాలను వివరించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 984 శ్రీ వర్ష, 975 బైపీసీలో హర్షిత, 944 వైష్ణవి, 936 సీఈసీలో రవళి, 731 హెచ్ ఈసీలోశివరాజ్, 644/1000 మార్కులు సాధించినట్లు తెలిపారు.

ద్వితీయ సంవత్సరం 95.23 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలియజేశారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో, బైరని లోకేష్ 456 వెల్దండి స‌హస్ర 449 బైపీసీలో ప్రణీత 418 శర్మని 402. సీ ఈ సీలోలో దివ్య 411,.ఆకాష్ 390, మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 17 మంది విద్యార్థులకు 400 మార్కులకు పైన ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 10 విద్యార్థులకు 900కు పైన మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బి శ్రీదేవి, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల అభినందించారు.

Leave a Reply