ఉప్లూర్ లో ప్రజాపాలన ప్రగతి – ప్రణాళిక గ్రామ సభ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కోసం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన గ్రామసభ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరలు పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాలు అర్హత గలా ప్రతి ఇంటికి చేరడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అయిన రైతు భరోసా,ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,గృహ జ్యోతి, రూ. 500 లకు గ్యాస్ సిలిండర్,మహిళలకు పావలా వడ్డీ రుణాలు,కొత్త రేషన్ కార్డులపై అవగాహన కల్పించారు. అలాగే గ్రామ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం అని తెలుపుతూ ఈ గ్రామ సభల్లో గ్రామాభివృద్ధికి కావాల్సిన అంశాలను,ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను, మరియు గ్రామ ప్రజల సూచనలను అభిప్రాయలను తెలుసుకోవడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తక్కురి ముత్యం, స్పెషల్ ఆఫీసర్,గ్రామ కార్యదర్శి రాఘవేందర్,ఏఈఓ రమేష్,ఏ ఎస్సై నరేందర్,సీసీ నవిన్,వార్డ్ సభ్యులు,కొమ్ముల సంతోష్,సాదుల్లా,అజయ్,రాకేష్, సురేష్,అనిల్,మరియు,గ్రామ మహిళలు,యువత, తదితరులు పాల్గొన్నారు.
