విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు అందజేత

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని పాతమామిపల్లి గ్రామానికి చెందిన జంజిరాల ఫణీంద్ర వర్మ ప్రథమ వర్ధంతి ని పురస్కరించుకుని అతని అతని తండ్రి జంజీరాల పెద్దయ్య,అతని స్నేహితులు కలిసి 10వ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మామిడిపల్లి హైస్కూల్ లో చదువుతున్న 20మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులను ప్రధానోపాధ్యాయులు ఏ నరేందర్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఫణీంద్ర వర్మ లేకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆత్మ శాంతించాలని అన్నారు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం గ్రామంలో ని రెండు పాఠశాలల విద్యార్థులకు బోజనాలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఫణీంద్రవర్మ కుటుంబ సభ్యులు,స్నేహితులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

Leave a Reply