మృతుని కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ విలీన సీతారాంపురం ఏడో వార్డులో అకాల మరణం చెందిన మృతుని కుటుంబానికి బిఆర్ఎస్ నేత నిత్యవసర సరుకులు అందజేశారు. పరకాల మున్సిపాలిటీ విలీన సీతారాంపురం 7వ వార్డ్ కు చెందిన అడప రాజు ఇటీవల మృతి చెందారు.
విషయం తెలుసుకున్న 7వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ కాంటెస్టెడ్ కౌన్సిలర్, బిఆర్ఎస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ దుంపేటి నాగరాజు ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఏఎంసీ మాజీ డైరెక్టర్ అడప రాజు, బిఆర్ఎస్ నాయకులు కనుకుంట్ల రాజు, అడప రామకృష్ణ, అడప శ్రీనివాస్, అడప మొగిలి, అడప సుధాకర్, అడప రవి, ఓదెల కుమారస్వామి, దుంపేటి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
