Protests | సిట్ నోటీసుల జారీపై రోడ్డుపై బైఠాయించి నిరసనలు…

Protests | నిజాంపేట, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ నిజాంపేట మండల కేంద్రంలో ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో ర్యాలీగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ… కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానమన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తోందని నేతలు ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ రానున్నది బీఆర్ఎస్ పార్టీ స్వర్ణ యుగమే అన్నారు. మోసపూరిత హామీలతో గదినెక్కిన కాంగ్రెస్ అడుగడుగునా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని అన్నారు.
ఇకనైనా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పై కేసులపై దృష్టి పెట్టకుండా ప్రజలపై,రైతులపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, యూత్ అధ్యక్షులు మావురం రాజు, బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్,సర్పంచులు అందే కొండల్ రెడ్డి, కనకరాజు,నాయకులు బాపూ రెడ్డి, బాల్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, వెంకటస్వామి, రాములు గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రెడ్డి శెట్టి రవీందర్, నాయిని వెంకటేశం, లక్ష్మణ్, మహేష్, శివ కుమార్, ఫాజిల్, బండారి తిరుమల్, రాగుల బాబు, తదితరులు పాల్గొన్నారు.
