హైద్రాబాద్ : కంచె గచ్చిబౌలి భూముల వేలం పై విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థులు ఏదో రూపంలో తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని భూములు యూనివర్సిటీకి చెందినవని, వాటి వేలాన్ని ఆపాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి యుగంధర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు.హెచ్ సీయూ భూముల పై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు దీక్ష విరమించేది లేదని యుగంధర్ స్పష్టం చేశాడు.
అర్ధరాత్రి హెచ్ సీయూ మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యుగంధర్ కు వైద్యులు హెల్త్ చెక్ చేశారు. ఆరోగ్యంగా ఉన్నాడని నిర్దారించాకే డాక్టర్లు యుగంధర్ నిరాహార దీక్షకు అనుమతి ఇచ్చారు. హెచ్ సీయూలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు.