ఖమ్మంలో పెన్షనర్ల ఆందోళన

ఖమ్మంలో పెన్షనర్ల ఆందోళన

యుద్ధ నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన ధర్నా

ఖమ్మం, ఆంధ్రప్రభ : భారత ప్రభుత్వం యుద్ధ నివారణ చర్యలు చేపట్టి నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాలని డిమాండ్ చేస్తూ వందలాది పెన్షనర్లు నగరంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. యుద్ధం వద్దు శాంతి ముద్దు ప్రపంచ శాంతి వర్ధిల్లాలి మానవహననాన్ని ఆపాలి పర్యావరణాన్ని కాపాడాలని పెన్షనర్లు ప్లకార్డులు చేతపట్టి వైరా రోడ్ లోని పెన్షనర్స్ భవన్ నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రదర్శన నిర్వహించారు.

అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సుబ్బయ్య టి వేణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇవ్వకుండా గత రెండు సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సమయంలో యుద్ధాన్ని ఆసరాగా చూపి నిత్యవసర వస్తువుల ధరలను పెంచడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ నివారణ కు పూనుకోవాలని తద్వారా నిత్యవసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఏకపక్షంగా ఇరాన్ పై దాడులు నిర్వహించడంతో దాని ప్రభావం భారతదేశంలో పడుతున్నదని బడి పిల్లలు అని చూడకుండా పాఠశాలల మీద బాంబులు వేయటం న్యాయం కాదని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు విడుదల చేయాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి ఆర్ వెంకట్ నారాయణ ఉపాధ్యక్షులు ఎస్ పూర్ణచందర్రావు కార్యదర్శి టి జనార్దన్ పి జానయ్య సీనియర్ నాయకులు సి బాబురావు తో పాటు ఖమ్మం నగర శాఖ నాయకులు పి బసవరావు ఆర్ రాధాకృష్ణ దొడ్డ రమేష్ జి ఆదినారాయణ నాగేశ్వరరావు సిహెచ్ బాబు సత్యనారాయణ వెంకటపతి రాజు ఆంజనేయులు పని రాజ్ కుమార్ గోవిందు మోహన్ దాస్ వెంకటేశ్వర్లు భాస్కర్ రెడ్డి గురవయ్య సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply