చర్యలు చేపడతామని హామీ..

చర్యలు చేపడతామని హామీ..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని 34వ డివిజన్ శివనగర్ ముంపు వరద ప్రాంతాలను గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చా హేత్ బాజ్పాయ్(Cha Het Bajpai) సందర్శించారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో 34వ డివిజన్ పల్లవి నర్సింగ్ హోమ్ రోడ్, పద్మశాలి కళ్యాణ మండపం, శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయం జంక్షన్ పూర్తిగా జలమయమయ్యాయి. శివనగర్లో ముంపు ప్రాంతం మైసయ్య నగర్ ను మించిన వరద ఉధృతి శివ భక్త మార్కండేయ దేవాలయం జంక్షన్ లో ప్రవహిస్తుంది.
భవనాలలో గ్రౌండ్ ఫ్లోర్(Ground Floor) గృహ యజమానులు తమ ఇళ్లను ఖాళీ చేశారు. 35వ డివిజన్ శివనగర్ వాటర్ ట్యాంక్ నుండి వందన హైస్కూల్ మీదుగా పద్మశాలి కళ్యాణ మండపం వరకు వరద నీరు, అగర్తాల చెరువు నీరు ఈ ప్రాంతం నుండి వరద వెళ్లిపోవడం వల్ల ఉన్న డ్రైనేజీల సాంద్రత తగ్గడం దీంట్లో డ్రైనేజీ నీరు(Drainage Water), వరద నీరు రోడ్లపై ప్రవహిస్తూ వాహనదారులను, గృహ యజమానులను, బాటసారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.
స్థానికులు వెంటనే మేయర్ కు ఫోన్ చేయగా స్పందించి ఈ రోజు ఉదయం 10 గంటలకు వచ్చి వరద నీటి ఉదృతను స్వయంగా కమిషనర్‌తో కలిసి పరిశీలించారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని మేయర్ కమిషనర్ హామీ ఇచ్చారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ లీగల్ చల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్(Samantula Srinivas), ఎమ్ హెచ్ ఓ, ఈఈ, అధికారులు, జవాన్లు, స్థానికులు పాల్గొన్నారు.

