మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి….

మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి….
కృషి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. ప్రసూన పిలుపు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మహిళలు వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో ఆధునిక పద్ధతులు అవలంబించి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. ప్రసూన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కేవీకే ప్రాంగణంలో మహిళా రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ.. దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు.
కేవలం ఇంటికే పరిమితం కాకుండా, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. మహిళా రైతులు సాధిస్తున్న విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం మహిళా రైతులు, కేవీకే సిబ్బంది కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, మహిళా రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
