పామర్రు – ఆంధ్రప్రభ : ప్రభుత్వం నిర్మించి నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీల(Medical Colleges)ను ప్రైవేటుపరం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిరంకుశత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి (YSRCP president Jaganmohan Reddy) పిలుపు పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పేరుతో 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలని నిర్ణయించిందన్నారు.
దేశంలో ఎక్కడా మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం (PPP policy) అనేది లేదన్నారు. గోవా, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు దానిపై ఆలోచన చేసినా, ప్రజావ్యతిరేకతతో ఆ పద్ధతిపై వెనక్కు తగ్గాయన్నారు. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉచిత వైద్య సేవలు దూరమై పేద రోగులు, మెడికల్ సీట్లు కోల్పోయి విద్యార్థులు నష్టపోతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందవని, ఇంకా రోగ నిర్ధారణ, ఇన్స్ట్పిషెంట్, మెడిసిన్స్కు ఛార్జ్ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

