Privatization | నల్ల చట్టాలను రద్దు చేయాలి

Privatization | నల్ల చట్టాలను రద్దు చేయాలి

  • వాటితో రైతులు, కార్మికుల‌కు న‌ష్టం
  • మెడికల్ కాలేజీలను పీపీపీ విధానాన్ని విరమించుకోవాలి
  • ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం

Privatization | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా నూతన చట్టం వీబీ జీ రాంజీ పేరుతో తెచ్చిందని, రైతులకు ఇచ్చిన హామీ అమలు పరచకుండా గిట్టుబాటు ధర కల్పించకుండా ఈ చట్టం తీసుకువ‌చ్చింద‌ని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ఆపాలని, తెచ్చిన నల్ల చట్టాల జీవో కాపీలను భోగి మంటలలో వేసి ద‌హ‌నం చేశారు. బుధవారం వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, స్థానిక సీపీఐ ప్రజా సంఘాల నాయకులు పద్మ, లక్ష్మక్క, శ్రీనివాసులు, వీరేష్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి కల్పించడానికి అవకాశం కల్పించే వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌ (గ్రామీణ్‌) (వీబీజీ-ఆర్ ఏఎం జి) అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించ‌డం దుర్మార్గమైన చర్య అన్నారు. రైతులకు నష్టం కలిగించే 2025 నూతన చట్టాన్ని తేవడం. కార్మికులకు 44 చట్టాలుండ‌గా, వాటిని 4 చట్టాలుగా రూపొందించడం వ్యవసాయ రైతు కార్మిక హక్కులను కాలరాస్తున్న‌దన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు జీవో నెంబర్ 590 మరియు 847 లను తీసుకువచ్చి పేద విద్యార్థులు చదువుకునే హక్కు కూడా లేకుండా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యవసాయ కార్మికులు, రైతులందరూ ఏకమై దుర్మార్గమైన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. దేశంలో వామపక్షాల మద్దతుతో దేశాన్ని పాలించిన తొలి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను లభిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవాలని వారు కోరారు.

Leave a Reply