ట్రావెల్స్‌ బస్సు బోల్తా

  • తప్పిన పెను ప్రమాదం


ఎమ్మిగనూరు టౌన్‌, సెప్టెంబర్‌ 7 (ఆంధ్రప్రభ): ఎమ్మిగనూరు (Emmiganur) లో మంగళవారం ఉదయం పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. సిరాలదొడ్డి సబ్‌స్టేషన్‌ సమీపంలో హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన సమయంలో బస్సు ( bus) లో సుమారు 18 మంది ప్రయాణికులు ఉండగా, అదృష్టవశాత్తూ వీరంతా స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.

ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమైన ర్యాష్‌ డ్రైవింగే (rash driving) కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మిగనూరు రూరల్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Leave a Reply