Private Individuals | కోటి మందికి వ్యతిరేక నిర్ణయమే..

Private Individuals | కోటి మందికి వ్యతిరేక నిర్ణయమే..

పత్తిపాడు నియోజకవర్గం ఇన్‌చార్జి బలసాని కిరణ్ కుమార్

Private Individuals | గుంటూరు, ఆంధ్రప్రభ: మెడికల్ కళాశాలలను (College) పీపీపీ విధానం అంటూ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని రాష్ట్రంలో కోటి మంది నిరసిస్తున్నారని పత్తిపాడు నియోజకవర్గం ఇన్‌చార్జి బలసాని కిరణ్ కుమార్ అన్నారు. గతంలో దేశం మొత్తం మీద కోటి సంతకాలను సేకరించడాన్ని కష్టంగా భావించేవారని ఆయన అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు కోటి మందికి పైగా సంతకాలు చేసి నిరసన వ్యక్తపరిచారంటే కూటమి ప్రభుత్వం పై ఎంత అసంతృప్తి ఉందో తెలుసుకోవాలని హితవు పలికారు. సంతకాల ద్వారా నిరసన వ్యక్తపరిచిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అందరికీ కృతజ్ఞతలని కిరణ్ కుమార్ తెలిపారు.

Leave a Reply