- ఘనంగా ఉత్తరాఖండ్ అవతరణ దినోత్సవం
- రూ.8,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
డెహ్రాడూన్, ఆంధ్రప్రభ : కొండ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఉత్తరాఖండ్‌లో రూ.8,260 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. వివిధ రంగాల్లో అది సాధించిన సమగ్ర పురోగతిని ప్రశంసించారు. ఉత్తరాఖండ్ (Uttarakhand)లో రూ.2 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పనులు జరుగుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.

