Prime Minister | పశ్చిమాసియా పరిస్థితులపై చర్చకు సిద్ధం

Prime Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ పరిణామాలు దేశంపై చూపే ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై మోదీ రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
ఈ భేటీ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక మార్గదర్శక వేదికగా నిలవనుంది. కేంద్ర-రాష్ట్రాల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టే దిశగా ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
