President | అంబేద్కర్ ఆశ‌యాలు కొన‌సాగించాలి…

President | అంబేద్కర్ ఆశ‌యాలు కొన‌సాగించాలి…


President | తిర్యాణి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని అంబేద్కర్ (Ambedkar) విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేతకాని మండల అధ్యక్షుడు దుర్గం రాజయ్య పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా దుర్గం రాజయ్య మాట్లాడుతూ… ఆయన దేశానికి చేసిన సేవలను బీసీ, ఎస్సీ ఎస్టీ బహు జనాల రాజ్యాధికారం కోసం ఆయన ఎంతో శ్రమించారన్నారు.

ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛ సమానత్వం, న్యాయం, రాజ్యాధికారం పొందుతున్నారంటే అది ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే అని, ఆయన మేధస్సుని ఉపయోగించి రక్తాన్ని దార పోసి రాజ్యాంగాన్ని రాశాడని ఆయన ఆశయాలను అందరం కలిసి కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గం రమేష్, జాడి, భూమయ్య, దుర్గం పవన్, తిరుపతి మేన రాజు గౌడ్, కుర్సెంగ, శోభన్, పగిడి మోహన్, పెందోర్ ధర్మం కళ్యాణపు నరేష్ వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply